త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం౹ త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ మహాదేవుడిని పూజిస్తారు
ఈ త్రిదళ బిల్వ పత్రంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు
ఈ బిల్వపత్రాలను సోమ,మంగళ,శుక్ర వారములలో, సంక్రమణం, అసౌచం, రాత్రి సమయాలలో కోయరాదు
ఈ బిల్వపత్రాలు చాలా రకాలున్నాయి. ఏకబిల్వం, త్రి బిల్వం, సప్త బిల్వం, షణ్ముఖ బిల్వం, పంచముఖ బిల్వం, అఖండ బిల్వం
అఖండ బిల్వ పత్రాన్ని గల్లాపెట్లో ఉంచితే వ్యాపారాభివృద్ధి, ఈ ఆకుతో ఇంట్లో పూజిస్తే వాస్తుదోషాలు తొలగుతుంది
త్రి దళం, ఉమ్మెత్త పువ్వుని కలిపి పూజిస్తే.. చతుర్విధ పురుషార్ధాలు లభిస్తాయి
శ్వేతబిల్వంతో పూజిస్తే ఆరోగ్యం సిద్ధిస్తాయి