ఆకర్షణీయమైన పర్వత శ్రేణులకు కూర్గ్ పెట్టింది పేరు. ఈ పర్యాటక ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపిస్తుంది
బీచ్‌లకు గోకర్ణ పెట్టింది పేరు. ఇక్కడ ఉన్న బీచ్‌లు చాలా ప్రత్యేకమైనవి, విభిన్నమైనవి. గోకర్ణలో శివుడి ఆలయం ఫేమస్
యునెస్కో గుర్తింపు పొందిన హంపి చుట్టూ ఉండే కొండలు, లోయలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి
చరిత్రకు సంబంధించిన శిధిలాలను ఇక్కడ మీరు చూడవచ్చు
నంది కొండల్లో సూర్యోదయానికి సంబంధించిన ఆకర్షణీయమైన దృశ్యాన్ని చూడొచ్చు
కర్ణాటకలోని టూరిస్ట్ ప్రాంతాల్లో మైసూర్ కూడా ఒకటి. ‘ప్యాలెస్ నగరం’గా ప్రసిద్ది చెందిన ఈ ప్రాంతంలో ఎన్నో విభిన్న విషయాలు ఉన్నాయి
మైసూర్ ప్యాలెస్, బొటానికల్ గార్డెన్స్, జూ పార్క్ కూడా ఇక్కడ ఫేమస్. ఇక్కడ నుంచి 120 కిలోమీటర్లలో ఊటీ కూడా చుట్టి వచ్చేయొచ్చు
బందీపూర్ నేషనల్ పార్క్ ప్రాజెక్ట్ టైగర్ కింద 1974లో స్థాపించారు. పర్యాటకులను ఈ ప్రదేశం బాగా ఆకట్టుకుంది