హీరోయిన్ అదాశర్మ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ది కేరళ స్టోరీ.
కేరళలో తప్పిపోయిన 32వేల మంది యువతలు ఏమయ్యారు? ఎక్కడున్నారు? అనే అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ప్రశంసలు, విమర్శల మధ్య ది కేరళ స్టోరీ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ దొరుకుతోంది.
నాలుగు రోజుల్లో ఈ చిత్రం రూ.45.72 కోట్లు రాబట్టింది.
తాజాగా ఈ సినిమా ఏ ఓటీటీలోకి వస్తుందని ఆరా తీస్తున్నారు అభిమానులు.
ది కేరళ స్టోరీ ఓటీటీ హక్కులను జీ5 ఇదివరకే సొంతం చేసుకుంది.
థియేటర్‌లో సక్సెస్‌గా దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశమే లేదు.
ది కేరళ స్టోరీని జీ5లో చూడాలంటే వచ్చే నెల వరకు ఆగాల్సిందే!