కాకతీయుల కాలంలో నిర్మింపబడిన ఎల్లకొండ శివాలయం తెలంగాణా శ్రీశైలంగా ప్రసిద్ధి

ఈ శివాలయానికి సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది

ఈ ఆలయ నిర్మాణం కూడా రామప్ప దేవాలయం శైలిలో ఉండి ఎంతో అందంగా, మనసుని ఆకట్టుకుంటుంది

కొండ పైన శివాలయం, కొండకు దిగువ భాగాన శంబుని ఆలయం ఉంది

ఆలయం ముందు ఒక అందమైన ఏడు కవచాల నాగిని శిల్పం ఆకర్షణీయంగా ఉంటుంది

శివాలయం మండపంలోని పై కప్పులు అష్టదిక్పాలకులతో చెక్కబడ్డాయి

ఎల్లకొండ గ్రామం హైదరాబాద్ జిల్లా కేంద్రం నుండి శంకర్‌పల్లి రోడ్డు మీదుగా దాదాపు 57 కిమీ దూరంలో ఉంది

వికారాబాద్ నుంచి బస్సు సర్వీస్ లు ఈ గ్రామానికి ఉంటాయి