సాధారణంగా మన దేశంలో పురుషులు సంపాదించడమే ఎక్కువ.ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది మహిళలూ సంపాదిస్తున్నారు.

ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అనే నానుడి ఉంది.

ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్న వ్యాపార వేత్తల్లో భార్య సహకారంతోనే బిజినెస్ ప్రారంభించిన వాళ్ళున్నారు

తన భర్త కలల్ని సాకారం చేయడానికి త్యాగమూర్తులుగా నిలిచిన మహిళామణులు  చాలా మంది  ఉన్నారు 

భర్తల వ్యాపారానికి కావలసిన మొదటి పెట్టుబడి అందించి వ్యాపారంలో గెలిపించిన స్త్రీ మూర్తులూ ఉన్నారు 

ఇన్ఫోసిస్‌ సహ- వ్యవస్థాపకుడు నారాయణమూర్తి తన సతీమణి సుధామూర్తి ఇచ్చిన తొలిపెట్టుబడితోనే కంపెనీని ప్రారంభించారు 

ఓలా క్యాబ్స్ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌  మొదట్లో తన భార్య రాజలాక్షి అగర్వాల్‌ ఇచ్చిన పెట్టుబడితోనే  బిజినెస్ స్టార్ట్ చేశారు

తన భార్య మద్దతుతోనే నౌకరీ.కామ్‌ను స్థాపించడానికి సంజీవ్‌ భిఖ్‌చందానీ ముందడుగు వేశారు.

ఇలా భర్తలను వెన్నుతట్టి.. వారి విజయం వెనుక వెన్నెముకలా నిలిచిన వారు ఎందరో ఉన్నారు.