కిడ్నీలో రాళ్ల సమస్యకు నివారణ చర్యలు..

మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి క్రిస్టల్- ఫార్మింగ్ పదార్థాలు ఎక్కువుగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.

మూత్రనాళాల్లో రాళ్లు ఉన్నప్పుడు అనేక సంకేతాలు కనిపిస్తాయి. విపరీతమైన నొప్పి, వికారం, వాంతులు, జ్వరం, చలి వంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీ స్టోన్స్ సమస్య కావచ్చు. వైద్యులను సంప్రదించాలి.

కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించడానికి ఎక్కువుగా నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువుగా తాగకపోతే మూత్రం ఎక్కువుగా అవ్వదు. దీంతో కిడ్నీలో రాళ్లు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

అధిక సోడియం ఆహారం మూత్రంలో కాల్షియం స్థాయిని పెంచుతుంది. దీంతో మూత్రపిండాల్లో రాళ్లకు కారణమవుతుంది. కిడ్నీలో రాళ్లు అభివృద్ధి చెందకుండా ఉండాలంటే సోడియం తక్కువుగా ఉన్న ఆహారం తీసుకోవాలి.

కాల్షియం ఎక్కువుగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది కాదనుకుంటారు. కాల్షియం తక్కువుగా ఉన్న ఆహారం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.

ఆక్సలేట్ ఆహారంలో సహజంగా లభించే పదార్థం. ఇది మూత్రంలో కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితం చేయడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు.

ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి.