బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు
గతాన్ని తలచుకొని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు
నాకు క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఆత్మీయులు ఎవరూ అందుబాటులో లేరు
ఓ రోజు హఠాత్తుగా వెన్నునొప్పి వచ్చి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా అనిపించింది
ఆస్పత్రికి వెళ్తే డాక్టర్లు టెస్ట్ చేసి క్యాన్సర్ అని చెప్పారు
మా కుటుంబంలో క్యాన్సర్‌తో ఇప్పటికే ఇద్దరు దూరమయ్యారు
చనిపోవాలని రాసి ఉంటే చనిపోతా.. కానీ నేను చికిత్స చేయించుకోనని తన సోదరితో అన్నారట
ఆ తర్వాత కొన్ని రోజులకు సంజయ్ చికిత్స తీసుకుని, క్యాన్సర్‌ను జయించాడు