విజయ్ తలపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘వారిసు’
ఇటీవల విడుదలైన ఈ మూవీ తమిళనాట మంచి హిట్ అయ్యింది
ఈ చిత్రంలో విజయ్ తల్లిగా జయసుధ నటించారు
ఈ మూవీ విజయం సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయసుధకు హీరో అజిత్ చిత్రం గురించి ఓ ప్రశ్న ఎదురైంది
‘ఇప్పటి వరకు ఎంతోమంది నటులకు అమ్మగా నటించారు. కానీ అజిత్‌కు అమ్మగా ఎందుకు చేయలేదు?’ అని ప్రశ్న ఎదురైంది
‘‘నాకు అజిత్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఒక రోజు షూటింగ్‌కు కూడా హాజరయ్యాను. అయితే కరోనా వ్యాప్తి కారణంగా షూటింగ్ సగంలోనే ఆగిపోయింది
తర్వాత షూటింగ్ మొదలైనా.. కొవిడ్ భయం కారణంగా ఆ సినిమా నుంచి వైదొలిగాను. నా బదులుగా ఆ పాత్రలో సుమిత్ర నటించింది’’ అని ఆమె చెప్పుకొచ్చారు
ఇటీవలే సంక్రాంతి రోజున అజిత్, విజయ్‌ల చిత్రాలు రిలీజ్ అవ్వగా ఈ ఇద్దరి హీరోల ఫాన్స్ మధ్య కోల్డ్ వార్ నడిచిన సంగతి తెలిసిందే