కొన్నాళ్లుగా సమంత వ్యక్తిగతంగా కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే
కానీ, తనకెదురైన ప్రతి సమస్యను అంతే దీటుగా ఎదుర్కొంటూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది సామ్
అయితే ఈ ప్రయాణంలో ఆధ్యాత్మికత చింతన ద్వారా ఆమె మానసిక దృఢత్వాన్ని, ప్రశాంతతను పొందుతున్నట్లు సోషల్ మీడియాలో తన పోస్ట్‌ల బట్టి అర్థమవుతోంది
లింగ భైరవి దేవి విగ్రహము ముందు తపో ముద్రలో కూర్చొని ఉన్న ఓ ఫొటోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో చేసింది సామ్
‘విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది.. ప్రశాంతంగా ఉంచుతుంది. అదే మీ గురువుగా.. స్నేహితునిగా మారుతుంది.
విశ్వాసం మిమ్మల్ని సూపర్ హ్యూమన్ గా చేస్తుంది’అంటూ ఆ ఫొటోకు ఓ కామెంట్ జోడించింది సామ్
ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోంది సామ్. హిందీలో ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్‌లో చేస్తుంది
గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ ఏప్రిల్ 14న విడుదల కానుంది