ఒకరు నటించాల్సిన చిత్రం/పాత్ర కొన్ని కారణాల మరొకరికి దక్కడం ఫిల్మ్లో ఇండస్ట్రీలో సాధారణం
స్టార్ హీరోలైన రామ్‌చరణ్, అల్లు అర్జున్‌లు తమ కెరీర్ ప్రారంభానికి ముందే ఆ అనుభవాన్ని ఎదుర్కొన్నారని మీకు తెలుసా
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘గంగోత్రి’ చిత్రంతో అల్లు అర్జున్ చిత్రసీమకి పరిచయం అయ్యాడు
ఈ సినిమాలో హీరోగా అల్లు అర్జున్ కంటే ముందు రామ్ చరణ్‌ను అనుకొంది చిత్రబృందం
‘‘చరణ్ నటనలో పరిణితి పొందేందుకు సమయం పడుతుంది. తను శిక్షణ పొందాలి. బన్నీ బాగుంటాడు.. తనతో చేయండి’’ అని చిరంజీవి ఆ చిత్ర బృందానికి చెప్పారంట
అలా.. చరణ్ నటించాల్సిన ‘గంగోత్రి’ మూవీ బన్నీ చేశారని, తనకు మంచి పేరొచ్చిందని ఓ ఇంటర్వ్యూలో నాగబాబు వెల్లడించారు
2003లో ‘గంగోత్రి’ రిలీజైన నాలుగేళ్లకు చరణ్ యాక్టర్ గా మారారు
2007లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ‘చిరుత’ మూవీతో రామ్ చరణ్ తెలుగు తెరకు పరిచయం అయ్యారు