'ఆర్​ఆర్​ఆర్' చిత్రంతో​ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్.

భారీ స్థాయి లైనప్ చిత్రాలు అయన చేతిలో ఉన్నాయి.

ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' చిత్రంలో హీరోగా  నటిస్తున్నారు.

ఈ చిత్రంతో  ఎన్టీఆర్ పక్కన కథానాయకిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.

ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీల్ తో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రంపై చిత్ర ప్రేమికుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.

ఇదిలా ఉంటె ఈ చిత్రంలో తారక్ సరసన ఓ గ్లోబల్ స్టార్  నటించనుందని సమాచారం.

ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా.

ప్రియాంక ఈ చిత్రంలో కథానాయకిగా దాదాపుగా కన్ఫామ్​ అయినట్టు తెలుస్తోంది.

అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.