ఇటీవల థాంక్యూ (Thank You) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య

ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా.. ఆశించినంతస్థాయిలో మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమాలో రాశీ ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలుగా నటించిన సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‏కు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 11 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

అనగా నేటి నుండి ఓటిటి లో థాంక్యూ మూవీ స్ట్రీమింగ్ కానుంది

ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ థాంక్యూ స్పెషల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.