సాధారణంగా చాలా మంది సినిమా హీరోలు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
కొంత మంది హీరోలకు అసలు సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు.
ఆ లిస్ట్ లో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కూడా ఉన్నారు.
తాజాగా దళపతి విజయ్ సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు.
విజయ్ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ ని క్రియేట్ చేశారు.
లియో సినిమాకు సంబంధించిన ఫోటో పోస్ట్ చేశారు విజయ్.
ఇలా అకౌంట్ ఓపెన్ చేశారో లేదో అప్పుడే మిలియన్ మంది ఫాలో వర్స్ వచ్చేశారు.
కేవలంలో గంటలోనే 1.1 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు దళపతి విజయ్ ని.