మధ్యప్రదేశ్ లోని రావణ్ గ్రామ్ లో రావణ ఆలయం ఉంది. ఈ గ్రామంలోని గ్రామస్థులు రావణుడిని పూజిస్తారు

రావణుడు విశ్రమించిన భంగిమలో 10 అడుగుల ఎత్తులో ఇక్కడ విగ్రహం ఉంది. దేవుడిగా పూజలను అందుకుంటున్నారు రావణబ్రహ్మ

కంసుడు సొంత చెల్లెలు, బావమరిదిని జైల్లో బంధించి .. తన ప్రాణాలను కాపాడుకోవడానికి పసికందులను హతమార్చాడు.. చివరికి మేనల్లుడు కృష్ణుడి చేతిలో మరణిస్తాడు

అయినప్పటికీ కంసుడిని దైవంగా పూజించే ఆలయం ఉత్తర్ ప్రదేశ్ లో హర్దోయ్ లో ఉంది. ఇక్కడ కంస ఆలయంలో కొన్నేళ్ల పాటు ధ్యానం చేశాడని స్థానికులు విశ్వసిస్తారు

కేరళ లోని పొరువజిలో పెరువృతి అనే గ్రామంలో దుర్యోధనుడిని దైవంగా కొలుస్తారు. ఇక్కడ ఆలయ మండపంలో ఎత్తయిన గద్దె మాత్రమే ఉంటుంది

ప్రజల క్షేమం కోసం ఆయన శివుడిని పూజించినందున, ఆయన్ని స్థానికులు పవిత్ర ఆత్మగా భావించి.. పూజిస్తారు

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో హిడంబికి ఓ ఆలయం ఉంది. ఆమె ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందిన ప్రాంతం ఇది అని స్థానికులు విశ్వసిస్తారు

ఐతే ఇక్కడ ఆలయంలో హిడంబి విగ్రహం లేదు.. ఆమె రెండు పాదముద్రలు భక్తితో పూజిస్తారు స్థానికులు