శివుడికి భూమిమీద విగ్రహ రూపంలో ఆలయాలు ఉండడం చాలా అరుదు

ఎక్కువగా శివయ్యను లింగాకారంలో భక్తులు పూజిస్తారు

 అందుకనే శివుడు విగ్రహ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రాన్ని ఎంతో పుణ్యం చేసుకొన్నవారు కానీ దర్శించలేరు అని ప్రతీతి

పశ్చిమగోదావరి జిల్లా యనమదుర్రు అనే గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి ఆలయం ఉంది

ఈ దేవాలయం అతి పురరాతనమైంది.. అత్యంత విలక్షణ శివలింగాన్ని కలిగి ఉన్నది

శీర్షాసనం లో అపురూపమైన భంగిమలో శివుడు శివలింగం పై దర్శనమిస్తాడు

శక్తి పీఠంలో శివుడు, పార్వతీదేవి తనయుడు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఒకే పానవట్టం మీద ఉండడం ఇక్కడ ప్రత్యేకత

అంతేకాదు పార్వతీ దేవి తన ఒడిలో పసికందైన సుబ్రమణ్యేశ్వర స్వామిని లాలిస్తున్నట్లు కొలువై ఉండడం విశేషం