అల్లు అర్జున్‍తో కలిసి ప్రపంచాన్ని కాపాడుతా.. సమంత కామెంట్స్..
Pic credit - Instagram
ఇన్నాళ్లు మయోసైటిస్ చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమంత.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వచ్చి యాడ్స్, పలు ప్రమోషన్లలో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఓ హాలీవుడ్ మూవీ ప్రమోషన్లలో పాల్గొంది సామ్. హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం ది మార్వెల్స్ విడుదలకు సిద్దమవుతుండగా.. కెప్టెన్ మార్వెల్ ఇది కొనసాగింపు.
ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సామ్.. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో పాల్గోంది. ఈ ఈవెంట్లో సమంతను కొన్ని విషయాలు అడగ్గా.. ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.
మీరు అవెంజర్ అయితే ఎవరితో కలిసి ప్రపంచాన్ని కాపాడుతారు ?.. అని ప్రశ్నించగా.. సామ్ బదులిస్తూ నా అభిమానులతో కలిసి ప్రపంచాన్ని కాపాడతానని చెప్పింది.
ఇండస్ట్రీ నుంచి ఎవరితో ప్రపంచాన్ని కాపాడుతారు ?.. అని అడగ్గా.. అర్జున్, విజయ్, ప్రియాంక చోప్రా, అలియాతో కలిసి కాపాడతానని చెప్పుకొచ్చింది సామ్.
అలాగే తన జీవితానికి సంబంధించిన సూపర్ హీరోలు అంటే ముగ్గురు ఉన్నారు. మా అమ్మ, నా స్నేహితులు, నేను ఎదుర్కోనే సమస్యలు నాకు సూపర్ హీరోస్.
ప్రస్తుతం సామ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. గతంలో సమంత, అల్లు అర్జున్ కలిసి నటించిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ అయ్యింది.
ఇటీవలే ఖుషి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అలాగే ఆమె నటించిన సిటాడెల్ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. ఇందులో వరుణ్ ధావన్ నటించారు.