బిగ్‌బాస్‌లో డ్రామా క్వీన్.. నామినేషన్స్‌లో అతి చేసిన శోభా..
06 September 2023
Pic credit - Instagram
బిగ్‌బాస్‌లో మొదటివారం నామినేషన్స్ ప్రక్రియ హిటెక్కింది. ఈసారి ఫస్ట్ వీక్‌లోనే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.
ఇందులో ముఖ్యంగా శోభా శెట్టి మాత్రం కార్తీక దీపం మోనితలా మారింది. ఏడవడం.. అంతలోనే నామినేట్ చేసిన అరవడం అన్ని క్షణాల్లో చేసేస్తోంది.
కిరణ్ రాథోడ్‌కు తెలుగు రాదని నామినేట్ చేసింది. నిజానికి శోభాకు కూడా తెలుగు భాష సరిగ్గా రాదు. ఇప్పుడిప్పుడే తెలుగులో మాట్లాడుతుంది శోభా.
ఇక గౌతమ్ కృష్ణతో తనకు బాండింగ్ ఏర్పడలేదని.. అంతేకాకుండా మేడమ్ అంటూ తనకు అతిగా గౌరవమిస్తున్నారంటూ రోటీన్ రీజన్ చెప్పేసింది.
నామినేట్ చేసిన విషయాన్ని మనసులో పెట్టుకోకుండా శోభాగారూ అంటూ నవ్వుతూ పలకరించాడు గౌతమ్. అయితే శోభా మాత్రం విచిత్రంగా రియాక్ట్ అయ్యింది.
అంత రెస్పెక్ట్ అవసరం లేదు అని శోభా అనగా.. మేడమ్ అనేది నా స్లాంగ్ పదం అని, అదేం తప్పు కాదు అంటూ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు గౌతమ్.
ఆ తర్వాత గౌతమ్ మరింత మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆమ్లెట్.. నామినేట్ అంటూ అడ్డదిడ్డంగా మాట్లాడింది మోనిత అలియసా శోభా శెట్టి.
ఇక చివరగా గౌతమ్ వచ్చి సారీ చెప్పినా.. వినిపించుకోకుండా నాకు నచ్చేదు.. చిరాకు అంటూ మోనిత పూనినట్టుగా బిహేవ్ చేసింది శోభా శెట్టి.