ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం.. రూల్స్‌ ఇవే

8 December 2023

మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద‌ డిసెంబర్ 9 నుంచి ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.  

 డిసెంబర్‌ 9 నుంచి

బాలిక‌లు, మ‌హిళ‌లు, ట్రాన్స్‌జెండ‌ర్లు ఆర్టీసీ బ‌స్సుల్లో శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి ఉచితంగా ప్రయానించవచ్చు

ఉచిత ప్రయాణం

రాష్ట్ర ప‌రిధిలో తిరిగే ప‌ల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించారు

రాష్ట్ర పరిధిలో

అలాగే సిటీలో ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్ బ‌స్సుల్లో మహిళలు ఎలాంటి టికెట్‌ లేకుండా ప్రయాణించవచ్చు

సిటీ ఆర్టీనరి

ఇక బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే మ‌హిళ‌ల‌కు సంబంధించిన ఛార్జి మొత్తాన్ని ఆర్టీసీకి ప్ర‌భుత్వం చెల్లించ‌నుంది

ఛార్జ్‌ మొత్తాన్ని

ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వ‌ర‌లోనే మ‌హిళ‌ల‌కు మ‌హాల‌క్ష్మి స్మార్ట్ కార్డుల‌ను అందించ‌నున్నట్లు ప్రభుత్వం తెలిపింది

స్మార్ట్‌ కార్డులు

మొద‌టి వారం రోజుల పాటు ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే మ‌హిళ‌ల‌కు ప్ర‌యాణించే వెసులుబాటు క‌ల్పించారు

ప్రీపెయిడ్‌

అంత‌ర్ రాష్ట్ర బ‌స్సుల్లో తెలంగాణ ప‌రిధి వ‌ర‌కు ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశం క‌ల్పించారు

ఆ పరిధి వరకు ఉచితం