తమిళనాడులోని తండయార్‌పేట్‌లో వినిపించాయి తమిళిసై వార్నింగ్స్.
అక్కడ ఓ బాలకల ప్రైవేటు పాఠశాల వార్షికోత్సవానికి వెళ్లిన తమిళిసై.. మిగతా బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నించారు.
అందులోభాగంగానే కొందరు శాడిస్టులు ఎలా ప్రవర్తిస్తారో, తనను ఎగ్జాంపుల్‌గా చూపించారు.
హేళనలకు తలొగ్గొద్దని, అగ్గిరవ్వలా మారాలని సూచించారామె.
నాపై అడ్డగోలుగా కామెంట్ చేస్తే చూస్తూ ఉండను అని హెచ్చరించారు.
నన్ను నల్లగా పిలిస్తే నేను నిప్పులా మారి పైకి లేస్తాను.
మీరు నన్ను ఆకతాయి అని పిలిస్తే, నేను నిప్పుకణంగా మారతా అంటూ హెచ్చరించారు.