యూట్యూబ్ వీడియోలు చూసి.. చైన్ స్నాచింగ్ నేర్చుకుని..

09 September 2023

యూట్యూబ్‌లో వీడియోలను చూసి మంచితో పాటు చెడు కూడా నేర్చుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు. తాజాగా అదే జరిగింది.

యూట్యూబ్‌లో వీడియోలు చూసి చైన్ స్నాచింగ్ నేర్చుకున్నాడు యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌కి చెందిన 30 ఏళ్ల చిడుగుల నరేశ్.

పోచంపల్లి దగ్గర బైక్‌పై వచ్చి ఓ వృద్ధిరాలి మెడలోని బంగారు చైన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించాడు. అయితే తెగిన చైను కిందపడిపోయింది.

ఆ వృద్ధురాలి బిగ్గరగా అరవడంతో నరేశ్ అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

సీసీటీవీ కెమరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును అదే రోజు ఛేదించారు. చైన్ స్నాచింగ్‌కు యత్నించిన నరేశ్‌ను గుర్తించి అరెస్టు చేశారు.

చైన్ స్నాచింగ్ కోసం నిందితుడు వాడిన బైక్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్‌కు పంపారు.

ఆన్‌లైన్‌లో రమ్మీ గేమ్స్ ఆడేందుకు చేసిన రూ.20 లక్షల అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు నిందితుడు పోలీసుల విచారణలో తెలిపాడు.

యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్‌కు సంబంధించిన వీడియోలు చూసి.. బైక్‌పై వచ్చి వృద్ధురాలి మెడలో చైన్‌‌ను లాక్కెళ్లేందుకు ప్రయత్నించినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు విస్తుపోయారు.