త్వరలో షియోమీ 14 సిరీస్ ఫోన్లు భారత్ మార్కెట్లో విడుదల.. ధర ఎంతంటే?

02 February 2024

TV9 Telugu

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తన షియోమీ 14 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. 

షియోమీ

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ చిప్ సెట్, హైపర్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్ గతేడాది అక్టోబర్ నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. 

స్నాప్‌ డ్రాగన్‌

భారత్ మార్కెట్లోకి వస్తున్న షియోమీ 14 సిరీస్ ఫోన్లు – షియోమీ 14, షియోమీ 14 ప్రో ఫోన్లను ఆవిష్కరిస్తారని సమాచారం. 

షియోమీ సిరీస్‌లు

ఈ ఫోన్లు లైకా ట్యూన్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌తో వస్తాయని కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తుంది.

కెమెరా సెటప్‌

గతేడాది దేశీయ మార్కెట్లో ఆవిష్కరించిన షియోమీ 13 ప్రో స్మార్ట్ ఫోన్, షియోమీ 13టీ ఫీచర్ ఫోన్లు లైకా ట్యూన్డ్ కెమెరాలతో వచ్చాయి. 

దేశీయ మార్కెట్లో

షియోమీ 13 ప్రో ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.79,999 పలికింది. 

 13 ప్రో ఫోన్‌

ఇక చైనాలో గత అక్టోబర్‌లో ఆవిష్కరించిన షియోమీ 14 స్మార్ట్‌ ఫోన్ ధర భారత్‌లో సుమారు రూ.50 వేలు ఉండే అవకాశం.

చైనాలో విడుదల

షియోమీ 14 ప్రో ఫోన్ ధర భారత కరెన్సీలో సుమారు రూ.56,500 ఉంది. ఈ ఫోన్‌లలో అద్భుతమైన ఫీచర్స్‌ను జోడించింది.

ధర