2023లో అత్యంత చెత్త పాస్‌వర్డ్‌లు ఇవే

TV9 Telugu

05 January 2024

ప్రస్తుత డిజిటల్ యుగంలో ప్రతిదీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. గుండుసూది నుంచి గుమ్మడికాయ దాకా ఒక క్లిక్‌తో కళ్ల ముందు వచ్చి వాలిపోతుంది.

టెక్నాలజీలో గణనీయమైన మార్పులు రావడంతో ప్రతి ఒక్కరూ మనీ ట్రాన్సాక్షన్స్ ఇతర వ్యవహారాలను ఎక్కువగా స్మార్ట్‌ఫోన్ నుంచే చేస్తున్నారు.

తమ ఫోన్లకు పాస్‌వర్డ్స్ క్రియేట్ చేస్తుంటారు. కొందరు ఆ పాస్‌వర్డ్స్ సరైన జాగ్రత్తలు తీసుకుంటారు. మరికొందరికీ వాటి గురించి ఇప్పటికీ తెలియదు.

2023లో ప్రజలు ప్రధానంగా ఎలాంటి పాస్‌వర్డ్స్ వాడుతున్నారనే దానిపై నార్డ్‌పాస్ ఒక నివేదికను ప్రచురించింది.

admin123 ఇలాంటి పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేసేందుకు 11 సెకన్ల సమయం పడుతుందట. Unknow అనే పాస్‌వర్డ్ హ్యాక్ చేసేందుకు 17 సెకన్లు సమయం చాలు.

123456, admin, 12345678, 000000, user, 1111 వంటి పాస్‌వర్డ్స్‌ను కేవలం ఒక సెకనులోపు హ్యాక్ చేస్తున్నారు.

pass@123 అనే పాస్‌వర్డ్ హ్యాక్ చేసేందుకు 5 సెకన్ల సమయం పడుతోందట. సులభంగా గుర్తుంచుకోవడానికి 12345678 కూడా సులభంగా హ్యాక్ చేయవచ్చు.

1234 వంటి తక్కువ పదాలతో పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేస్తున్నప్పుడు, వ్యక్తులు దానిని తమ పాస్‌వర్డ్‌గా మార్చుకుంటారు. అయితే ఇది మీకు సమస్యలను సృష్టించవచ్చు.

చాలా మంది 1234567890,111111 పాస్‌వర్డ్‌లను సులభంగా గుర్తుండేలా ఎంచుకుంటారు, కానీ హ్యాకర్లు సులభంగా క్రాక్ చేయవచ్చు.