వినియోగదారులు గొప్ప న్యూస్ మోసుకొచ్చింది ప్రముఖ కంప్యూటర్ తయారీ సంస్థ HP. ప్రపంచంలోనే రీయూజబుల్ బ్యాటరీతో మొట్టమొదటి సరికొత్త కదిలే కంప్యూటర్లను ఆవిష్కరించింది.
HP Envy Move పేరుతో విడుదలై ల్యాప్‌టాప్.. ఎలాంటి బ్యాగుతో లేకపోయినా, కీ బోర్డు ఉండగానే పట్టుకునేలా హ్యాండిల్, ప్యాకెట్ ఏర్పాటు చేశారు.
HP Envy Moveను ఎప్పుడైనా.. ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లేలా తీర్చిదిద్దారు. HP Envy Moveలో అద్భుతమైన అత్యాధునిక టెక్నాలజీతో ఈ హెచ్‌పి ల్యాప్‌టాప్ వాడుకునేలా రూపొందించారు.
గేమింగ్, స్ట్రీమింగ్‌తో పాటు ఈ ల్యాప్‌టాప్‌ను ఎక్కడైనా... ఎప్పుడైనా సులభంగా వాడుకునేలా తయారు చేశారు.
16GB RAM, 1TB వరకు స్టోరేజీ సపోర్ట్ కలిగిన ల్యాప్ టాప్ పరిమాణానికి సరిపోయే బ్యాక్ ప్యాక్ డివైజ్‌తో అందుబాటులోకి వచ్చింది. 24 Inches QHD డిస్‌ప్లే కలిగిన సరికొత్త ల్యాప్‌టాప్‌ను ప్రత్యేక సెన్సార్ అమర్చారు.
HP Envy Move ల్యాప్‌టాప్‌లో 13th జనరేషన్ Intel Core 15 Processorతో పని చేస్తుంది. ఇందులో 16GB RAM, 1TB వరకు స్టోరేజీ సపోర్ట్ ఉంది.
ఫైల్ షేరింగ్స్, ఫోన్ కాల్స్, టెక్స్ట్, నోటిఫికేషన్ల కోసం, ఆండ్రాయిడ్, ఐఫోన్ డివైజ్‌లకు కనెక్ట్ చేసే Intel Unison చిప్ కూడా ఉంది.
అత్యాధునిక టెక్నాలజీతో వచ్చిన HP Envy Move ల్యాప్ టాప్ ధర మార్కెట్ లో అక్షరాల రూ.74,796కు లబిస్తుంది.