ప్రపంచంలోనే మొదటి నీటిపై ఎగిరే బోటు..!

26 November 2023

ఆధునిక యుగంలో అందుబాటులోకి నీటిపై తేలియాడుతూ, ఎరిగి బోటు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ప్యాసింజర్ షిప్ రూపకల్పన.

స్వీడిష్‌కు చెందిన కాండెలా టెక్నాలజీ సంస్థ తయారు చేసిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ప్యాసింజర్ షిప్.

వచ్చే ఏడాది నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ప్యాసింజర్ షిప్‌కు Candela P-12గా నామకరణం.

స్వీడిష్‌కు చెందిన 39 అడుగుల పొడవున్న ఈ Candela P-12 బోట్ బ్యాటరీ సహాయంతో గంటకు 252 కిలోవాట్ శక్తిని ఇస్తుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ప్యాసింజర్ షిప్‌లో ఒకేసారి 30 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు.

ఇది గరిష్టంగా గంటకు 56 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 92 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

హైడ్రోఫాయిల్స్. ఎయిర్‌ఫాయిల్స్ సహాయంతో విమానాలు బయలుదేరినట్లుగా నీటిపై ఎగురుతున్నట్లు ఈ బోటు కనిపిస్తుంది.

మీడియా నివేదికల ప్రకారం, సాధారణ ఎలక్ట్రిక్ పడవలతో పోలిస్తే Candela P-12 80 శాతం తక్కువ శక్తిని ఉపయోగిస్తుంది.