డ్రైవర్‌లెస్ కార్లు వచ్చేస్తున్నాయి.. ఎప్పటి నుంచంటే?

TV9 Telugu

12 October 2024

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కంపెనీ కొత్త ఆవిష్కరణతో మరోసారి మన ముందుకు వచ్చారు. ఏంటది అని ఆలోచిస్తున్నారా.?

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'టెస్లా సైబర్‌క్యాబ్‌' రానే వచ్చింది. "వీ రోబోట్" కార్యక్రమం ద్వారా సైబర్‌క్యాబ్‌‌ను ఇంట్రడ్యూస్ చేసింది.

ఇది స్టీరింగ్ వీల్స్, పెడల్స్ లేకుండా రూపొందించిన వాహనం కావడం విశేషం. డ్రైవర్‌లెస్ సాంకేతికతతో ఈ వాహనం పనిచేస్తుంది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, టెస్లా అధినేత రోబోటాక్సీని ప్రవేశపెట్టారు.త్వరలోనే ఇది మార్కెట్‎లోకి విడుదల కానుంది.

ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో టెస్లా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు.

ఆటోమేటిక్‌గా నడిచే ఈ 'టెస్లా సైబర్‌క్యాబ్‌' కారు ధర 30 వేల డాలర్ల అంటే దాదాపు రూ.25 లక్షలు ఉంటుందని సమాచారం.

తాజాగా దాని నమూనాను అవిష్కరించారు టెస్లా సీఈవో ఎలన్ మస్క్. ఈ కారు 2026 సంవత్సరంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

2026లో ప్రారంభమైన నిర్మాణ సంస్థ కాలిఫోర్నియాలోని బార్‌బ్యాంక్‌లో జరుగుతున్న "వీ రోబోట్" కార్యక్రమంలో ఈ కారు నమూనాను ప్రదర్శించారు.