ఈ గ్రహశకలంలో టన్నుల బంగారం.. 

14 September 2024

Battula Prudvi 

అంతరిక్షంలో చాలా విలువైన గ్రహశకలాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. బంగారం కూడిన గ్రహశకలం గురించి మీకు తెలుసా?

మొదటిసారిగా 1852 సంవత్సరంలో బంగారం గ్రహశకలాన్ని ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ కనుగొన్నారు.

ఈ గ్రహశకలం మీద టన్నుల కొద్దీ బంగారం ఉంది. శాస్త్రవేత్తలు దీనికి 16Psyche అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు.

బంగాళాదుంప ఆకారంలో ఉన్న ఈ గ్రహశకలం సగటు వ్యాసం సుమారు 140 మైళ్లు (226 కిలోమీటర్లు) ఉంటుందని తెలిపారు.

16Psyche గ్రహశకలంపై ప్రస్తుతం ఉన్న బంగారం విలువ బిలియన్ డాలర్ల మేరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

దీని కోర్ నికెల్, ఇనుముతో కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లాటినం, బంగారం తోపాటు అనేక విలువైన లోహాలు దీనిలో ఉన్నాయి.

ఈ గ్రహశకలంపై బంగారంతో పాటు పెద్ద మొత్తంలో వజ్రం కూడా ఉండి ఉండవచ్చని భావిస్తున్నారు అంతరిక్ష శాస్త్రవేత్తలు.

16Psyche గ్రహశకలంలో భూమి కంటే 17 రెట్లు ఎక్కువ వజ్రాలు ఉన్నాయంటున్నారు అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు.