వెబ్‌లో వాట్సప్ లాక్ స్క్రీన్ ఫీచర్ గురించి తెలుసా ??
వినియోగదారులకు మరింత భద్రత కల్పించేందుకు సరికొత్త ఫీచర్‌తో ముందుకు వచ్చింది ప్రముఖ మెసింజర్ దిగ్గజం వాట్సాప్.
ఆఫీసుల్లో కంప్యూటర్ మీద ఎక్కువ మందితో కలిసి పనిచేయాల్సి వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేసి ఉండటం వల్ల సమాచార భద్రతకు ముప్పు.
వాట్సాప్ సమాచారం చోరీ కాకుండా ఉండాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భద్రత ఫీచర్‌ను తీసుకొచ్చింది వాట్సాప్.
వెబ్ వాట్సాప్ ఉపయోగిస్తూ పనిచేస్తున్నప్పుడు అప్పుడప్పుడు విరామం తీసుకుంటాం. ఓపెన్ చేసి పెడితే ఇతరులు సమాచారాన్ని చూడొచ్చు.
మాటిమాటికీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయకుండా లాక్ స్క్రీన్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్.
కంప్యూటర్‌లో web.whatsapp.com లో క్యూఆర్ కోడ్‌తో లాగిన్ కావాలి. టాప్‌లో కనిపించే మూడు చుక్కల గుర్తు మీద క్లిక్ చేసి, సెటింగ్స్‌లోకి వెళ్లాలి.
సెటింగ్స్‌లో ప్రైవసీని ఎంచుకొని కిందికి స్క్రోల్ చేస్తూ వెళ్లి, లాక్ స్క్రీన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కనిపించే సూచనలు పాటిస్తూ పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి.
ఆటోమేటిక్ స్క్రీన్ లాక్ టైమింగ్ ఎంచుకోవడం ద్వారా దానంతటదే స్క్రీన్ లాక్ అయిపోతుంది.