25 October 2023

టెక్‌ షేమ్‌ అంటే ఏంటి.? జెడ్‌ తరానికి ఎదురవుతున్న ఇబ్బందేంటి.?

1995-2012 మధ్య పుట్టిన జనరేషన్‌ జడ్‌ ఇప్పుడిప్పుడే ఉద్యోగ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. 

చిన్నతనం నుంచి మొబైల్‌ ఫోన్లు, ట్యాబ్‌, ల్యాప్‌టాప్‌లు వినియోగించడంలో ముందు వరుసలో ఉండేవారే. 

కానీ ఆఫీసుల్లో పనిచేసేటప్పుడు  పాత తరం కంప్యూటర్లు, ప్రింటర్లు, ఫ్యాక్స్‌ మెషీన్ల వాడకం విషయంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నారట. 

దాదాపు సగం మంది ఇలా సాంకేతికంగా ఇబ్బంది పడ్డారని లాసల్లే ఏజెన్సీ అనే సంస్థ తన సర్వేలో తెలిపింది. 

ఉద్యోగ జీవితంలో ఇలా టెక్నాలజీని వాడలేకపోవడాన్ని ఆ వ్యక్తులు అసమర్థతగా భావిస్తున్నారట. 

పైగా తోటి వారిని అడగడానికి మొహమాట పడతారని, ఒకవేళ వారు ఏదైనా అంటే అవమానంగా భావించడాన్ని టెక్‌షేమ్‌గా పిలుస్తారు.

టెక్ షేమింగ్‌ను జనరేషన్‌ జడ్‌ యువత తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. 

దీన్ని నివారించాలంటే మేనేజర్‌ స్థాయి వ్యక్తులు కొత్తగా ఉద్యోగంలో చేరే వ్యక్తులపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.