ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ అనేది మనందరి జీవితాల్లో ఓ భాగంగా మారింది. ప్రతి చిన్న అవసరానికి ఫోన్ అనేది తప్పనిసరిగా మారింది.
స్మార్ట్‌ఫోన్ అనేది ఎలక్ట్రానిక్ పరికరమని అందరికీ తెలిసిన విషయమే. స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ డౌన్ అవ్వడం పెద్ద సమస్యగా అందరూ భావిస్తూ ఉంటారు.
ఫోన్ వాడినా వాడకపోయినా అది ఆన్‌లో లేకపోతే మనశ్శాంతి ఉండదు. మీ ఫోన్ ఎక్కువసేపు స్విచ్ ఆఫ్ అయి ఉంటే ఏమవుతుంది.
మీ ఫోన్ ఒక నెల పాటు స్విచ్ ఆఫ్‌లో ఉంటే, దాన్ని మళ్లీ స్విచ్ ఆన్ చేయవచ్చు. సాధారణంగా ఒక నెల తర్వాత తెరిచినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గవచ్చు.
ఒక సంవత్సరం పాటు స్మార్ట్‌ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉంటే అది డిశ్చార్జ్ కావచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ అవ్వకపోవడం లేదా పాడైపోవడం వంటి సమస్యలు రావచ్చు.
ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. బ్యాటరీ సమస్యల గురించి కచ్చితంగా తెలియనప్పుడు, మీ ఫోన్‌ని రీస్టార్ట్ చేయడం ఉత్తమం.
మీ పరికరం పునఃప్రారంభమయ్యే వరకు దాదాపు 30 సెకన్ల పాటు పవర్ బటన్‌ను పట్టుకోవాలి. అవసరమైతే స్క్రీన్‌పై “పునఃప్రారంభించు” ఎంచుకోవలి.
ఇది బ్యాక్‌గ్రౌండ్ ప్రాసెస్‌లను క్లియర్ చేయగలదు. బ్యాటరీ జీవితం కోసం మీ ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌గా ఉంచాలి. సెట్టింగ్‌లను తెరిచి, “సిస్టమ్”కి వెళ్లి, “సిస్టమ్ అప్‌డేట్” ఎంచుకోవాలి.