జనవరి 1 నుంచి యూపీఐ కొత్త రూల్స్‌.. ఏం మార్పులు జరిగాయి అంటే..?

02 January 2024

TV9 Telugu

సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ రూల్స్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేసింది భారతదేశ ప్రభుత్వం.

గూగుల్​పే, పేటీఎం, ఫోన్​పే లాంటి యూపీఐ ఐడీలను ఏడాది కాలంగా వాడకపోతే తొలగిస్తామని ‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)' ప్రకటించింది.

యూనిఫైడ్ పెమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల నుంచి చేసే గరిష్ట రోజువారీ చెల్లింపు పరిమితిని NPCI పెంచింది.

విద్య, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల కోసం యూపీఐ లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచింది భారతీయ సంస్థ NPCI.

ఆర్బీఐ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనున్న యూపీఐ ఏటీఎంలతో మీరు మీ బ్యాంక్ ఖాతా నుంచి నేరుగా క్యాష్‌ తీసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయవచ్చు.

ఇక నుంచి యూపీఐ యాప్‌ల ద్వారా ఎవరికి డబ్బు పంపినా వారి బ్యాంకు ఖాతాలో ఉండే పూర్తి పేరు స్క్రీన్​పై కనిపిస్తుంది.

ఈ రూల్స్ సోమవారం (జనవరి 1) నుంచి అమలులోకి వచ్చాయి. ఇకనుంచి యూపీఐ పెమెంట్స్ మరింత సెక్యూర్ గా మారింది.

‘నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)' తీసుకొచ్చిన ఈ రూల్స్ తో కొందరి ఐడీలు తొలగించబడ్డాయి.