మారిన తీరు.. సెలవులను ఎలా గడుపుతున్నారంటే..

12 December 2023

సెలవులను గడిపే తీరు అంతా ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మారిపోయిందని అంటున్నారు నిపుణులు. అది అదెలాగంటే..

రానున్న క్రిస్మస్‌ న్యూ ఇయర్‌ సెలవుల సీజన్‌ను ఎలా గడుపుతారన్న దానిపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ సిస్కో ప్రపంచవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు తెలిసాయి.

భారతీయుల్లో 85 శాతం మంది గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్‌ యాప్‌ల వాడకం ద్వారా సెలవులను విస్తృతంగా ఎంజాయ్‌ చేయనున్నారట.

సినిమాలు, టీవీ షోలు, క్రీడలు, సంగీతాన్ని ఆస్వాదించడానికి వినోద యాప్‌లను ఉపయోగించాలని 88 శాతం మంది భారతీయులు యోచిస్తున్నారు.

72 శాతం మంది అలెక్సా, స్మార్ట్‌ హోమ్‌ వంటి ఇంటర్నెట్‌తో అనుసంధానించిన పరికరాలను వినియోగించాలని అనుకుంటున్నారు.

84 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్‌ కావడానికి సోషల్‌ మీడియా, వీడియో కాల్స్‌ సాధనాలను ఎంచుకున్నారు.

చివరి నిమిషంలో బహుమతులు, తమ హాలిడే వంటకాల కోసం తుది పదార్థాలను కొనుగోలు చేసేందుకు 75 శాతం మంది రిటైల్‌ యాప్‌లను వాడతామని అన్నారు.

78 శాతం మంది వార్తలు, సమాచార ఆధారిత యాప్‌లను, 88 శాతం మంది టేక్‌ అవే కోసం ఫుడ్‌ డెలివరీ సేవలను వినియోగిస్తారని సర్వేలో తేలింది.