06 October 2023
ట్విట్టర్ ఎక్స్ యూజర్స్‌కు సరికొత్త ఫీచర్..
సరికొత్త టెక్నాలజీతో ట్విట్టర్ ఎక్స్ యూజర్స్‌ను సర్‌ప్రైజ్ చేసిన ఎలాన్ మస్క్.
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ఎక్స్‌ను సూపర్ యాప్‌గా మార్చేందుకు అందుబాటులోకి సరికొత్త ఫీచర్లు.
ఇప్పటికే ఆడియో,వీడియో కాలింగ్, పిక్-ఇన్-పిక్ మోడ్ వంటి ఫీచర్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ఎక్స్.
ఫోన్ నంబర్ లేకుండానే ఎక్స్ అకౌంట్ ద్వారా ఆడియో, వీడియో కాల్ అవకాశం అందుబాటులోకి వచ్చింది.
తాజాగా అత్యాధునిక టెక్నాలజీతో వీడియో గేమ్ స్ట్రీమింగ్ అనే సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన ఎలాన్ మస్క్.
కొత్త ఫీచర్‌ను స్వయంగా పరీక్షించి.. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేసిన ఎలాన్ మస్క్.
ప్రస్తుతం ఈ ఫీచర్ వీడియో గేమ్ స్ట్రీమింగ్ ఎక్స్ ప్రీమియం సబ్‌స్క్రైబర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.
త్వరలోనే సాధారణ యూజర్లకు వీడియో గేమ్ స్ట్రీమింగ్ పరిచయం చేయనున్నట్లు ప్రకటించిన ట్విట్టర్ ఎక్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి