గూగుల్ నుంచి వీడియో క్రియేషన్ ఏఐ యాప్
TV9 Telugu
11 April 2024
ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువగా ప్రజలు ఉపయోగిస్తున్న సెర్చ్ ఇంజిన్ గూగుల్. దీని ద్వారా అనేక విషయాలు తెలుసుకుంటన్నారు.
టెక్ట్స్ నుంచి వీడియోలను క్రియేట్ చేసే గూగుల్ విడ్స్ యాప్‌ను టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్తగా ప్రవేశపెట్టింది.
గూగుల్ విడ్స్‌ను ఎవరైనా వాడొచ్చు. బోర్ కొట్టేలా ఉన్న వర్క్ డేటాను ఆసక్తి కలిగించే వీడియోల రూపంలో మార్చుకోవచ్చు.
ఈ నూతన యాప్ టెక్ట్స్ ప్రాంప్ట్స్ నుంచి వీడియోలను క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు గూగుల్ తెలిపింది.
ఏఐని వాడుతూ యూజర్లు తమ వర్క్ కోసం ఈ యాప్ ద్వారా వీడియోలను క్రియేట్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది.
ఆ పై యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా వీడియోలను ఎడిట్ చేసుకోవచ్చు. తమ సొంత వాయిస్ ఓవర్‌ను కూడా జోడించవచ్చు.
ఎడిట్ చేసుకునే వెసలుబాటుతో గూగుల్ విడ్ స్టోరీబోర్డ్‌ను జనరేట్ చేస్తుందని గూగుల్ బ్లాగ్‌పోస్ట్‌లో రాసుకొచ్చింది.
ఈ యాప్‌లో వీడియో, రైటింగ్, ప్రొడక్షన్, ఎడిటింగ్ ఉంటాయి. మీ బ్రౌజర్ నుంచి ప్రాజెక్టులను సురక్షితంగా షేర్ చేసుకోవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి