భూమిపై నుంచి అంతరిక్షంలోకి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఉపగ్రహాలను పంపుతున్నాయి. రకరకాల సమాచారాన్ని తెలుసుకునేందుకు.. కమ్యూనికేషన్ వ్యవస్థల కోసం ప్రయోగాలు జరిపుతున్నాయి.
అంతరిక్షంలోకి ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు ప్రైవేటు సంస్థలు సైతం ప్రవేశించి ప్రయోగాలు నిర్వహిస్తున్నాయి.
ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేసి వదిలి వేయడంతో అంతరిక్షంలో చెత్త పేరుకుపోతుందని శాస్త్రవేత్తల ఆందోళన.
అంతరిక్షంలో చెత్త పేరుకుపోవడానికి కారణమైన ఓ ప్రైవేటు ప్రయోగ సంస్థకు అమెరికా భారీ జరిమానా విధించింది.
2002 లో ఎకోస్టార్ 7 అనే ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రయోగించి అమెరికాకు చెందిన డిష్ నెట్‌వర్క్ కంపెనీ.
లైఫ్ టైం అయిపోవడంతో ఇంధనం లేక అక్కడే ఉండిపోయిన అమెరికాకు చెందిన డిష్ నెట్‌వర్క్ కంపెనీ శాటిలైట్. డిష్ నెట్‌వర్క్ సంస్థ తీరుపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఆ సంస్థకు ఫైన్ వేసింది.
డిష్ నెట్‌వర్క్ కంపెనీకి 1.50 లక్షల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.1.24 కోట్ల జరిమానాను విధించిన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్-ఎఫ్‌సీసీ..
ప్రస్తుతం పనిచేయకుండా అంతరిక్షంలో దాదాపు 27 వేల వస్తువులు ఉన్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గుర్తించింది.