ఇలా చేస్తే.. యాడ్స్ లేకుండానే యూట్యూబ్ వీడియోస్..!

19 October 2023

ప్రపంచవ్యాప్తంగా ఎంతో జనాదరణ కలిగిన వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌. ప్రతిఒక్కరి స్మార్ట్ ఫోన్ లో ఇది కచ్చితంగా ఉంటుంది.

వీడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌ ద్వారా స్మార్ట్ ఫోన్ లో రకరకాల వీడియోలను ఉచితంగా చూడొచ్చు.

యూట్యూబ్ వీడయోస్‌కు పాపులారిటీని బట్టి చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో వ్యూయర్లకు యాడ్స్‌ కూడా వస్తుంటాయి.

సీరియస్‌గా వీడియోస్ చూస్తున్న వారికి ఇబ్బంది కలిగిస్తున్న యూట్యూబ్ యాడ్స్. ఇది దాదాపు అందరూ పేస్ చేసి ఉంటారు.

యాడ్స్ నుంచి వినియోగదారులకు విముక్తి కలిగించేలా కొత్త టూల్స్ అందుబాటులోకి తెచ్చిన మొబైల్ యాప్ యూట్యూబ్.

ఎలాంటి యాడ్స్ లేకుండా యూట్యూబ్‌లో వీడియోలు చూడాలంటే, యూట్యూబ్ ప్రీమియం సర్వీస్ అందుబాటులోకి వచ్చింది.

వినియోగదారులు యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్‌ తీసుకోవడం ద్వారా క్రియేటర్లు తమ సబ్‌స్క్రైబర్స్ నుంచి పేమెంట్స్ పొందవచ్చు.

యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ వంటి ప్లాట్‌ఫామ్స్ కూడా యాడ్స్-టైర్ ప్లాన్స్ ద్వారా యాడ్స్ లేకుండా చూడొచ్చు.