స్మార్ట్ ఫోన్ లో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నా.. దానికి లైఫ్ ఇచ్చేంది మాత్రం బ్యాటరీ బ్యాకప్. యాప్‌ల వాడకాన్ని బట్టి బ్యాటరీ లైఫ్ ఆధారపడి ఉంటుంది.
స్మార్ట్‌ఫోన్ వాడే కొద్దీ బ్యాటరీ పవర్ రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది. కొత్త ఫోన్‌లా మళ్ళీ పని చేయాలంటే ఈ టిక్స్ పాటించండి!
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సెట్టింగ్స్ మార్చడం వల్ల బ్యాటరీ పనితీరును మెరుగుపడుతుందంటున్నారు టెక్ నిపుణులు. ఇది ఎంత వరకు నిజం..!
చాలా రోజుల పాటు సెల్‌ఫోన్‌ను ఆన్ చేయకుండా పెడితే.. బ్యాటరీలో సమస్యలు తలెత్తుతాయి. బ్యాటరీ సెట్టింగ్స్ మార్చడం ద్వారా కొంతవరకు మాత్రమే ప్రయోజనం ఉంటుంది.
బ్యాటరీ హీటింగ్, రీ ఛార్జింగ్ వంటి సమస్యలు మాత్రమే పరిష్కరం అవుతాయి. కొత్త దానిలా పనిచేస్తుందని చెబితే పూర్తిగా అబద్ధం అంటున్నారు ఎక్స్‌ఫర్ట్స్
రోజు రోజుకీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పనితీరు క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొత్తదానిలా చేయడం దాదాపు అసాధ్యం. కానీ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా పనితీరును మెరుగు పరచవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లోకి వచ్చి చేరిన పనికిరాని యాప్‌లను ఎప్పటికప్పుడు అన్‌ఇన్‌స్టాల్ చేయడం మంచిదంటున్నారు టెక్ నిపుణులు.
సెల్‌ఫోన్ పనికి రాని యాప్‌ల కారణంగా బ్యాటరీపై నిరంతరంగా చెడు ప్రభావం ఉంటుందంటున్నారు. విషయం తెలుసుకునే లోపే బ్యాటరీ పూర్తిగా పాడైపోతుంది.
సాధారణంగా తమ పాత స్మార్ట్ ఫోన్లలో సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయరు. దీని కారణంగా బ్యాటరీ వీకవుతుంది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేస్తే, బ్యాటరీ లైఫ్‌ను కాపాడుతుంది.
అలాగే ప్రతి సారి 100% ఫోన్ చార్జింగ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 90 శాతం దాటి చార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఓవర్ ఛార్జింగ్‌ను అదుపు చేయవచ్చు.