స్మార్ట్‌ఫోన్ తరుచూ హీటెక్కుతోందా? ఈ చిట్కా మీకోసమే!
27 September 2023
ప్రస్తుతం మనిషి జీవితంలో ఓ ముఖ్యమైన భాగంగా మారిపోయిన స్మార్ట్‌ఫోన్లు. స్మార్ట్ ఫోన్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సూర్యకాంతి తగలకుండా చూసుకోవాలి.
ప్రతిరోజు సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెట్టే ప్రదేశం చల్లగా.. పొడి ప్రదేశంలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడు హీట్ ఎక్కదు.
మీ స్మార్ట్‌ఫోన్ మామూలు స్థితి కంటే ఎక్కువ వేడిగా ఉందని అనిపిస్తే, దాన్ని వాడకుండా పక్కన పెట్టడం మంచిది.
ఎండలో ఉండాల్సి వచ్చినప్పుడు స్మార్ట్ ఫోన్ ఎక్కువ సమయం ఉపయోగించడం మానుకోవాలి. లేదంటే మొబైల్ హీట్ అవుతుంది.
స్మార్ట్‌ఫోన్ ఫుల్ ఛార్జ్ కోసం రాత్రంతా ఛార్జింగ్ పెడితే.. ఓవర్ హీట్ అవ్వడంతో పాటు బ్యాటరీ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంది.
మీ స్మార్ట్‌ఫోన్‌ను ఓవర్ ఛార్జ్ చేయకండి. ఫోన్లు పిల్లో లేదా దుప్పటి కింద ఉంచడం వంటివి అస్సలు చేయొద్దు.
స్మార్ట్‌ఫోన్ వాడే హీటెక్కుతుందని బావిస్తే, కొద్ది సేపు సెల్ ఫోన్ పౌచ్ వాడకపోవడం మంచిది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యాష్ బోర్డు సమీపంలో ఉంచకూడదు.
ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతంలో కారు పార్క్ చేసి, దాని లోపల మీ ఫోన్‌ని ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. 35 డిగ్రీల సెల్షియస్ కంటే ఎక్కువ హీట్ ఉండే ప్రాంతంలో ఫోన్ ఉంచకూడదు.