ఏప్రిల్ 15 నుంచి స్మార్ట్‌ఫోన్‌లో ఈ రూల్ మారనుంది..!

TV9 Telugu

01 April 2024

భారతీయ టెలికాం శాఖ (DoT) ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు మొబైల్స్ కొనుగొలు, యూజేజ్ విషయంలో తీసుకుంటూ ఉంటుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 15 నుండి USSD ఆధారిత కాల్ ఫార్వార్డ్‌ను డీయాక్టివేట్ చేయాలని నిర్ణయించారు అధికారులు.

ప్రత్యామ్నాయంగా దీన్ని పునఃప్రారంభించవచ్చని DoT జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సంస్థ అధికారులు.

ప్రస్తుతానికి ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి మార్పులు చేయాలని నిర్ణయించారు టెలికం శాఖలో పనిచేస్తున్న అధికారాలు.

అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (USSD) సేవ IMEI నంబర్, బ్యాలెన్స్‌ని తనిఖీ చేయడానికి ఉపయోగిస్తారు.

ఆన్‌లైన్ లో జరుగుతున్న సైబర్ క్రైమ్, ఫేక్ ఫోన్ కాల్స్ వంటి నేరాలను తనిఖీ చేయడానికి DoT ఈ నిర్ణయం తీసుకుంది.

టెలికాం శాఖ అధికారులు చెబుతున్న దాని ప్రకారం, ఇది అనధికార కార్యకలాపాలకు ఉపయోగించపడుతుందని అంటున్నారు.

15 ఏప్రిల్ 2024 నుండి అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానును తెలిపింది టెలికాం శాఖ.