13 September 2023

ఐఫోన్‌ 15 సిరీస్‌లో కొత్త ఫీచర్స్ ఇవే

Pic credit - Instagram

సెప్టెంబరు 12న కాలిఫోర్నియాలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో సరికొత్త మార్పులతో మార్కెట్‌లోకి వచ్చేసింది ఐఫోన్‌ 15 సిరీస్‌.

ఐఫోన్‌ 15 సిరీస్‌ సెల్‌ఫోన్లతో పాటు న్యూలుక్‌తో 9 సిరిస్ వాచ్, అల్ట్రా 2 వెరియంట్ వాచ్‌‌ను ప్రవేశపెట్టింది. 

 ప్రో మోడళ్లకు మాత్రమే పరిమితం చేసిన కొన్ని సరికొత్త ఫీచర్లను యాపిల్‌ బేస్‌ మోడళ్లను తీసుకువచ్చింది. 

డైనమిక్‌ ఐలాండ్‌ రూపంలో కెమెరా, ఫేస్‌ ఐడీ వంటి సెన్సర్లను ముందు భాగంలోనే పొందుపరిచింది. 

ఇన్‌కమింగ్‌ కాల్స్‌, నోటిఫికేషన్లు, మ్యూజిక్‌ ప్లేబ్యాక్‌ వంటి ఫంక్షన్స్ పై నుంచి నియంత్రించేలా కీలక మార్పు.

యూరఫ్ దేశాల సమాఖ్య నిబంధనలకు అనుగుణంగా ఈసారి కొత్తగా యూఎస్‌బీ- సి పోర్ట్‌ను ఇచ్చింది. 

కొత్త యాక్షన్ బటన్‌ తీసుకువచ్చిన యాపిల్.. కెమెరా, ఫ్లాష్‌లైట్‌, వాయిస్‌ మెమో, నోట్‌, ఫోకస్‌ మోడ్‌లను మార్చుకునేలా వీలు.

ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌లో 48MP కెమెరాను ప్రవేశపెడుతోంది యాపిల్ కంపెనీ.  

కొత్త మోడల్స్‌లో ఏ16 బయోనిక్‌ ప్రాసెసర్‌ను ప్రవేశపెట్టింది యాపిల్. ఐఫోన్‌ 14 తో పోలిస్తే ఐఫోన్‌ 15 మోడల్స్‌ 7 రెట్లు వేగం. 

ఐఫోన్‌ 15లో టైటానియం డిజైన్‌తో తీసుకొచ్చారు. దీనివల్ల ఫోన్‌ బరువు చాలా వరకు తగ్గుతుంది.