జనవరి నాటికి నిబంధనలు కఠినం.. స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లకు అడ్డుకట్ట

30 October 2024

Subhash

 వచ్చే ఏడాది జనవరి నాటికి స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌ల అడ్డుకట్టకు సవరించిన కఠిన నిబంధనల్ని తీసుకువస్తామని ట్రాయ్‌ తెలిపింది.

వచ్చే ఏడాది

ఈ  స్పామ్‌ కాల్స్‌ అరికట్టే విధానం అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ చైర్మన్‌ అనిల్‌ కుమార్‌ లహోటి తెలిపారు. 

స్పామ్‌ కాల్స్‌

ఇటీవలి తమ కన్సల్టేషన్‌ పేపర్‌పై జరిపిన విస్తృత చర్చల తర్వాత స్పామ్‌ కాల్స్‌పై ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

స్పామ్‌ కాల్స్‌

మొబైల్‌ వినియోగదారులను విసిగిస్తున్న స్పామ్‌ కాల్స్‌, మెసేజ్‌లకు మరింత కఠిన నిబంధనల అమలు అవసరమని గుర్తించామన్నారు.

మొబైల్‌

ఇటీవల టెలికం శాఖ నుంచి వచ్చిన సిఫార్సు ఆధారంగా టెలీమార్కెటీర్ల కోసం రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై మరో కన్సల్టేషన్‌ పేపర్‌ను సైతం సిద్ధం చేయబోతోంది.

టెలికం 

స్పామ్‌ కాల్స్‌, మోసపూరిత మెసేజ్‌లకు చెక్‌ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నామని  చేయబోతున్నామని ట్రాయ్‌ చీఫ్‌ తెలిపారు.

స్పామ్‌ కాల్స్‌

గత కొన్ని నెలలుగా ఈ స్పామ్‌ కాల్స్‌పై తాము తీసుకుంటున్న చర్యలను తాజాగా ట్రాయ్‌ పీటీఐకి వివరించారు.

ట్రాయ్‌

స్పామ్‌ కాల్‌పై నిషేధం విధించడం వల్ల మోసాలు జరుగకుండా చూసుకోవచ్చని ట్రాయ్‌ అభిప్రాయపడింది. వినియోగదారులకు కూడా ఈ కాల్స్‌ ఇబ్బందులు తప్పుతాయి.

స్పామ్‌ కాల్‌ నిషేధం