కృత్రిమ సూర్యుడిన సృష్టించిన శాస్త్రవేత్తలు..!

TV9 Telugu

05 April 2024

సూర్యుడి నుండి శక్తిని ఉత్పత్తి చేయడానికి ఒక పవర్ ప్లాంట్‌ను నిర్మించారు దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు.

న్యూక్లియర్ ఫ్యూజన్ ఉష్ణోగ్రత 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్‌గా దక్షణ కొరియా సైంటిస్టులు చూపడం జరిగింది.

48 సెకన్ల వ్యవధిలో 100 మిలియన్ సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిన దక్షిన కొరియా సైంటిస్టులు.

కొరియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యూజన్ ఎనర్జీ (KFE) కొరియా సూపర్ కండక్టింగ్ టోకామాక్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ (KSTAR) ఫ్యూజన్ రియాక్టర్ ఆధ్వర్యంలో ప్రయోగం.

సూర్యుని కోర్ ఉష్ణోగ్రత 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్. సూర్యుని కోర్ కంటే ఏడు రెట్లు ఉష్ణోగ్రతలు ఎక్కువ.

హైడ్రోజన్, హీలియం రెండు పరమాణువులు కలిసిపోయి భారీ మొత్తంలో శక్తిని విడుదల చేయడానికి కలిసిపోతాయని అంటున్నారు.

దీని ప్రత్యేకత ఏమిటంటే పవర్ ప్లాంట్ నుండి ఎటువంటి కాలుష్యం ఉండదు. ఈ పవర్ ప్లాంట్ ఎటువంటి కార్బన్ వాయువును విడుదల చేయదు.

కార్బన్ వాయువు విడుదల లేకపోవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ జరగదు. ఇది అందుబాటులోకి వస్తే చాల సమస్యలు తీరుతాయి అన్నారు.