ఇకపై పేమెంట్ యాప్‌లకు చెక్.. అరచేతితో చెల్లింపులు..!

TV9 Telugu

26 October 2024

పేమెంట్స్ కోసం ఇప్పటి వరకు చూసిన టెక్నాలజీ అంతా ఒక ఎత్తు.. ఇప్పుడు మనం మాట్లాడుకునే టెక్నాలజీ మరో ఎత్తు.

డిజిటల్‌ పేమెంట్‌లో ఇది నెక్ట్స్‌ లెవల్‌. ఇక నుంచి బిల్‌ పేమెంట్‌ చేయడానికి మీ అరచేతిని ఉపయోగిస్తే చాలు. పేమెంట్‌ అయిపోతుంది.

భారత్‌లో అందుబాటులోకి రానున్న పామ్‌ పేమెంట్‌ సిస్టమ్‌. కేవలం అరచేతితో చెల్లింపులు చేయవచ్చు. అదెలా అనుకొంటున్నారా.?

షాపింగికి వెళ్తే... డబ్బులు కోసం డెబిట్‌, క్రెడిట్‌ కార్డుతోనో, యూపీఐల అవసరం లేకుండా స్కానర్‌ ముందు అరచేతిని ఉంచితే రెండు మూడు సెకన్లలోనే పేమెంట్ అయిపోతుంది.

ఈ న్యూ టెక్నాలజీ ప్రస్తుతం చైనాలో అందుబాటులో ఉంది. అక్కడి జనాలంతా అరచేతితో చెల్లింపులు చేస్తున్నారు.

పామ్‌ ప్రింట్‌ డివైజ్‌లో మీ హ్యాండ్‌ని స్కాన్‌ చేసి రిజిస్టర్‌ అవ్వాలి. ఏ షాపింగ్‌కి వెళ్లినా హాండ్‌ స్కాన్‌ చేసి బిల్‌ చెల్లించవచ్చు.

మన అరచేతి నకలు మన బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌తో లింక్‌ అయిపోతుంది. ఈ విధంగా అరచేయి పేమెంట్స్ కోసం రిజిస్టర్ అవుతుంది.

ఒకసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయితే.. మీరు ఎక్కడైనా కేవలం అరచేతిని ఉపయోగించి నగదు రహిత చెల్లింపులు చేయొచ్చు.