అలర్ట్‌.. మీ మొబైల్‌ పేలకుండా ఉండాలంటే ఈ తప్పులు అస్సులు చేయకండి

31 March 2024

TV9 Telugu

తరచుగా మొబైళ్లు పేలుడు కేసులు వింటుంటాము. ఇలాంటి అనేక ఉదాంతాలు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నవారున్నారు.

పేలుడు

మొబైల్‌ ఫోన్లు పేలడానికి గల కారణాల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ముందస్తు జాగ్రత్తలు పాటించవచ్చు.

కారణాలు

మొబైల్‌ ఫోన్లు పేలుడు సంభవించడానికి ప్రధాన కారణం లిథియం-అయాన్‌ బ్యాటరీలు వేడెక్కడం.

పేలడానికి ప్రధాన కారణం

తరచుగా ప్రజలు తమ మొబైల్‌లను గంటల తరబడి ఛార్జింగ్‌లో ఉంచుతారు. ఇది పేలుళ్లకు కారణం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గంటల తరబడి ఛార్జింగ్‌

మొబైల్‌ను ఛార్జింగ్‌లో ఉంచినప్పుడు బ్యాటరీలోని భాగాలు వేగంగా స్పందిస్తాయి. ఎక్కువ సేపు ఛార్జింగ్‌ అలా ఉంచితే పేలిపోయే అవకాశం ఉంది.

మొబైల్‌ ఛార్జింగ్‌

వేగవంతమైన ప్రతి కారణంగా బ్యాటరీలో వేడి కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ వేడి మొబైల్‌ పేలుడుకు కారణం కావచ్చు.

బ్యాటరీలో వేడి ఉత్పత్తి

అదే సమయంలో చాలా మంది వ్యక్తులు బ్యాటరీ సమస్య, ఉబ్బిన బ్యాటరీలను ఉపయోగిస్తారు. ఇది ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది.

ఉబ్బిన బ్యాటరీ

చాలా మంది తమ ఫోన్లను మొబైల్‌ కవర్లతో ఛార్జ్‌ చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఫోన్‌ వేడెక్కుతుంది. దీని వల్ల పేలిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

కవర్స్‌