02 November 2023
యూట్యూబ్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అత్యంత ఎక్కువ ప్రజాదరణ కలిగిన సోషల్ మీడియా వీడియోస్ ఫ్లాట్‌పామ్ యూట్యూబ్.
యూట్యూబ్‌లో వీడియోస్ చూడాలనుకునే చాలామంది వినియోగదారులు అందులో వచ్చే యాడ్‌లను తప్పుంచుకోవాలనుకుంటారు.
యాడ్స్ లేకుండా యూట్యూబ్ యాప్ లో వీడియోస్ ను చూడటానికి కొందరు కస్టమర్స్ యాడ్ బ్లాకర్లను వాడుతుంటారు.
ఇకపై తమ వినియోగదారులు ఎవరైనా యాడ్ బ్లాకర్స్‌ని వినియోగిస్తే అంతే సంగతులని హెచ్చరించింది యూట్యూబ్ సంస్థ.
ఒకవేళ యాడ్ బ్లాకర్స్‌ని వినియోగించే కస్టమర్లను బ్లాక్ చేసేలా సరికొత్త టెక్నాలజీని తీసుకువచ్చేందుకు ఫ్లాన్ చేసింది యూట్యూబ్.
ప్రపంచవ్యాప్తంగా యాడ్ బ్లాకర్లు వాడే కస్టమర్లకు మెసేజ్‌లు పంపించి బ్లాక్ చేస్తోంది యూట్యాబ్ సంస్థ.
యాడ్స్ లేకుండా యూట్యూబ్ లో వీడియోస్ ను చూడాలనుకుంటే ఖచ్చితంగా యూట్యూబ్ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇకనుంచైనా యాడ్ బ్లాకర్లు ఉపయోగించడం ఆపండి లేదంటే మొండికేస్తే యూట్యూబ్ బ్లాక్ అయి ఇబ్బంది పడాల్సివస్తుంది.