కొత్త గ్రహం గ్లీస్ 12బిని కనుగొన్న శాస్త్రవేత్తలు

TV9 Telugu

03 June 2024

భూమిలనే జీవం ఉండే అవకాశం ఉన్న ఓ కొత్త ఎక్సోప్లానెట్‌ను తాజాగా కనుగొన్నరు అంతరిక్ష పరిశోధన శాస్త్రవేత్తలు.

ఈ గ్రహం భూమి కంటే చిన్నది, వీనస్ కంటే పెద్దదిగా ఉన్నట్లు గుర్తింపు. ఎక్సోప్లానెట్ పేరు Gliese 12b అని అంటున్నారు.

కొత్త గ్రహం గ్లీస్ 12బిని కనుగొనడానికి శాస్త్రవేత్తలు నాసా ట్రాన్సిటింగ్ ఎక్సోప్లానెట్ సర్వే శాటిలైట్ (TESS) టెలిస్కోప్‌ను ఉపయోగించారు.

కొత్త గ్రహం దాదాపు 40 కాంతి సంవత్సరాల దూరంలో మీన రాశిలో ఉన్న చిన్న నక్షత్రం చుట్టూ తిరుగుతోందన్న శాస్త్రవేత్తలు.

ఈ నక్షత్రం మన సూర్యుడి పరిమాణంలో 27%, దాని ఉష్ణోగ్రత 60%. ఎక్సోప్లానెట్ సగటు ఉపరితల ఉష్ణోగ్రత 42 డిగ్రీల సెల్సియస్.

కొత్త ఎక్సోప్లానెట్ ఆవిష్కరణ రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ యొక్క మంత్లీ నోటీసుల జర్నల్‌లో ప్రస్తావించారు.

మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న ఏదైనా గ్రహాన్ని ఎక్సోప్లానెట్ అంటారు. ఇప్పటివరకు కనుగొనబడిన భూమికి అత్యంత సమీపంలో ఉన్న ఎక్సోప్లానెట్ ఇదే.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత వేగవంతమైన అంతరిక్ష నౌక గ్లీస్ 12బిని చేరుకోవడానికి దాదాపు 2.25 లక్షల సంవత్సరాలు పడుతుంది.