కొత్త గూగుల్‌ మ్యాప్స్‌ ఫీచర్‌తో పెట్రోల్‌ ఆదా!

17 December 2023

ప్రపంచవ్యాప్తంగా అందరూ తమ ప్రయాణంలో దారి తెలియకపోయిన, షార్ట్ కట్స్ కోసం కచ్చితం ఉపయోగించేది గూగుల్ మ్యాప్స్.

అలాంటి గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ ని యాప్ లో యాడ్ చేయనుంది. ఈ ఫీచర్ ద్వారా ఇంధనాన్ని ఆదా చేసుకోవచ్చు.

ప్రయాణంలో ఇంధనాన్ని ఆదా చేయడం కోసం ‘ఫ్యూయెల్‌ సేవింగ్‌’ పేరుతో గూగుల్‌ మ్యాప్స్‌ భారత్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రయాణ మార్గాల్లో ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ అప్‌డేట్లు అందించడంతో పాటు ఇంధన సామర్థ్యాన్ని ఇది అంచనా వేస్తుంది.

ఇందుకోసం వెళ్తున్న వాహన వేగం, ఇంధన వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది ఈ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.

మన ప్రయాణానికి ఎంచుకున్న మార్గం ఆధారంగా.. ఎంతమేరకు ఇంధనం అవసరమవుతుందో అంచనా వేసి తెలియజేస్తుంది ఈ ఫీచర్.

దీంతో వాహన వినియోగదారులు ఇంధనాన్ని పొదుపు చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది ఈ ఈ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్.

టోల్‌ రుసుముల గురించీ వివరాలు అందిస్తుంది. ఇప్పటికే అమెరికా, యూరోప్‌, కెనడాల్లో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది.