త్వరలో భారత్ మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ.. అద్భుతమైన ఫీచర్స్‌

11 October 2024

Subhash

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన మిడ్ రేంజ్ శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనుంది.

 శాంసంగ్

ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ రంగుల్లో లభిస్తుందని తెలుస్తోంది. 

గ్లోబల్ మార్కెట్లో

ఈ శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్‌కు ఆరేళ్ల పాటు సెక్యూరిటీ, ఆరేళ్ల పాటు ఓఎస్ అప్ డేట్స్ అందిస్తుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ16

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్ 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.23 వేలు (249 యూరోలు).

శాంసంగ్ గెలాక్సీ ఏ16 

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ ఫోన్  మీడియాటెక్ డైమెన్సిటీ 6300 సూపర్ అమోలెడ్ స్క్రీన్, ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ విత్ ఆల్ట్రా వైడ్ లెన్స్.

శాంసంగ్ గెలాక్సీ ఏ16

90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 

శాంసంగ్ గెలాక్సీ ఏ16 5జీ

ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 ఓఎస్ పై పని చేస్తుంది.  ఏ16 5జీ ఫోన్  50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా.

ఆండ్రాయిడ్ 14 

2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 25 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జర్‌. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 బ్యాటరీ