27 May 2024
TV9 Telugu
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్‌ను సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్, 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది.
ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్‌తోపాటు 50-మెగా పిక్సెల్స్ సెన్సర్ మెయిన్ కెమెరాతో కూడిన ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29,999.
12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తాయి. అప్రికాట్ క్రష్, రైజిన్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్55 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.55 అంగుళాల ఫుల్ హెచ్డీ+ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్ ప్లే.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ కలిగి ఉంటుంది. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ వన్ యూఐ 6.1 వర్షన్.
ఐదేండ్లు సెక్యూరిటీ అప్‌డేట్స్.50-మెగా పిక్సెల్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్స్.