07 July 2024
TV9 Telugu
రియల్‌మీ భారత్ మార్కెట్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్లను తెచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.
రియల్‌మీ (Realme) తన రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బేస్డ్ ఆల్ట్రా క్లియర్ కెమెరా ఫీచర్ జత చేసింది.
ఇందులో సోనీ ఎల్వైటీ 701 కెమెరా సెన్సర్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. రియల్‌మీ 13 ప్రో సిరీస్ ఫోన్లలో రియల్‌మీ 13 ప్రో+, రియల్‌మీ 13 ప్రో ఫోన్లు ఉంటాయి.
రెండు ఫోన్లలోనూ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఎల్వైటీ -701 కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్).
50 మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 పెరిస్కోప్ కెమెరా విత్ 3ఎక్స్ ఆప్టికల్ జూమ్ కేపబిలిటీ కలిగి ఉంటుంది.
రియల్‌మీ 13 ప్రో ఫోన్లలో ఏఐ ప్యూర్ బొకెహ్, ఏఐ నాచురల్ స్కిన్ టోన్, ఏఐ ఆల్ట్రా క్లారిటీ ఫీచర్లు ఉంటాయని రియల్‌మీ తెలిపింది.
రియల్‌మీ 13 ప్రో+ 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ మద్దతుతో 6.7 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది.
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్+ 512జీబీ స్టోరేజీ. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ఓఎస్ 14 వర్షన్. 80వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5050 ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాటరీ .