తక్కువ ధరల్లో రియల్‌మీ నుంచి మరో అద్భుతమైన ఫోన్‌.. ఫీచర్స్‌ ఇవే!

2 April 2024

TV9 Telugu

రియల్‌మీ మరో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. 

బడ్జెట్‌ ఫోన్‌

4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999, 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,999, 8జీబీ ర్యామ్ +  128 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.14,999.

4జీబీ ర్యామ్‌

45 వాట్ల చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ, 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా.

చార్జింగ్‌

మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ట్విలైట్ పర్పుల్, వుడ్ లాండ్ గ్రీన్ కలర్ ఆప్షన్లు, మూడు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.

మీడియాటెక్‌ డైమెన్సిటీ

4జీబీ ర్యామ్ వేరియంట్ రూ.10,999, 6జీబీ ర్యామ్ వేరియంట్ రూ.11,999, 8 జీబీ ర్యామ్ వేరియంట్ రూ.13,999లకు లభిస్తాయి.

ధర

రియల్‌మీ 12ఎక్స్ 5జీ (Realme 12x 5G) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.72-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (2400×1080 పిక్సెల్స్ రిజొల్యూషన్) డిస్ ప్లే.

రీఫ్రెష్‌ రేటు

ఆండ్రాయిడ్ 14 బేస్డ్‌తో వచ్చే ఈ ఫోన్‌ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 8- మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 16-మెగా పిక్సెల్స్ సెన్సర్ కెమెరా.

ఆండ్రాయిడ్‌ 14

ఒకసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 645 గంటలు స్టాండ్ బై, 34.5 గంటలు ఫోన్ కాల్, 81.3 గంటలు మ్యూజిక్, 15.9 గంటలు బ్యాకప్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

చార్జింగ్‌